ముమ్మరంగా యాంటీ లార్వల్, ఫీవర్ సర్వేలు
పలమనేరు, అక్టోబర్ 07 ( గరుడ ధాత్రి ) : దోమల నివారణ మరియు పరిసరాల పరిశుభ్రతపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పలమనేరు సబ్ యూనిట్ ఆఫీసర్ జయశంకర్ సూచించారు. ఆయన ఆధ్వర్యంలో బుధవారం కాకాతోపు యూపీహెచ్‌సీ పరిధిలోని వినాయక్ నగర్‌లో వైద్య సిబ్బంది యాంటీ లార్వల్, ఫీవర్ సర్వేలను ముమ్మరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డెంగ్యూ వ్యాధి లక్షణాలు, నివారణ చర్యలపై ప్రజలకు ఇంటింటికీ తిరిగి విస్తృత అవగాహన కల్పించారు. ప్రధానంగా 'ఫ్రైడే-డ్రైడే' కార్యక్రమం ప్రాముఖ్యతను వివరిస్తూ.. ప్రతి శుక్రవారం ఇళ్లలో నిల్వ...