మురాసు తుపానుపై జిల్లా యంత్రాంగం అప్రమత్తం
ప్రజల భద్రతకు ప్రథమ ప్రాధాన్యత.. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి జిల్లా, డివిజన్, మండల స్థాయిలో కంట్రోల్ రూమ్ల ఏర్పాటు తిరుపతి, నవంబర్ 2 గరుడదాత్రి న్యూస్ : మురాసు తుపాను ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తిరుపతి జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పకడ్బందీ ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం...