మురుగునీటి సమస్య పరిష్కరించకుండా కాంక్రీట్ తొలగింపుపై స్థానికుల ఆగ్రహం

మురుగునీటి సమస్య పరిష్కరించకుండా కాంక్రీట్ తొలగింపుపై స్థానికుల ఆగ్రహం గరుడధాత్రి న్యూస్ : ఒకనాటి అధికారులు, పాలకుల నిర్లక్ష్యం నేడు వివాదానికి కేంద్రబిందువుగా మారింది. పట్టణంలోని కోటమిట్ట ప్రాంతంలో మురుగునీటి సమస్యపై స్థానికులు, పంచాయతీ అధికారుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని డ్రైనేజీ సమస్య చివరకు రోడ్డుపై కాంక్రీట్ తొలగింపు వివాదానికి దారితీసింది. కోటమిట్టలో మునస్వామి కుటుంబం నివాసం ఉంటోంది. ఆయన ఇంటి ముందు గతంలో తక్కువ ఎత్తులో సీసీ రోడ్డు నిర్మించడంతో ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే...