మురుగు నుండి మోక్షం ఎప్పుడో?

-రోడ్లపై డ్రైనేజీ మురుగు నీరు.. గ్రామస్తుల ఆందోళన గరుడధాత్రి న్యూస్ : తిరుపతి జిల్లా, వరదయ్యపాలెం మండలం, తొండంబట్టు పంచాయతీ పరిధిలోని నాగనందపురం గ్రామంలో డ్రైనేజీ సమస్య రోజురోజుకు తీవ్రరూపం దాలుస్తోంది. గ్రామంలోని పలు వీధుల్లో మురుగు నీరు రోడ్లపైకి పొంగిపొర్లుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామ అభివృద్ధికి ప్రతీకగా నిలవాల్సిన నాగనందపురం ప్రస్తుతం మురుగు నీటి సమస్యతో సతమతమవుతోంది. రోడ్లపై నిలిచిపోయిన మురుగు నీటిలోనే గ్రామస్తులు నిత్యం రాకపోకలు సాగించాల్సి వస్తోంది. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. మురుగు నీటి...