ముసలిమడుగులో ఘనంగా ప్రపంచ ఏనుగుల దినోత్సవం
- కుంకీ ఏనుగులకు ప్రత్యేక పూజలు, అలంకరణ - విద్యార్థులకు ఏనుగుల దాడుల నుంచి తప్పించుకునే మెలకువలపై అవగాహన పలమనేరు, ఆగస్టు 12 ( గరుడ ధాత్రి ) : పలమనేరు రూరల్ మండలం ముసలిమడుగు ఎలిఫెంట్ క్యాంపులో బుధవారం ప్రపంచ ఏనుగుల దినోత్సవ వేడుకలను అటవీశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాంపులోని కుంకీ ఏనుగులకు సిబ్బంది స్నానపానాదులు చేయించి, ప్రత్యేక రంగులతో అందంగా అలంకరించారు. అనంతరం ఏనుగులకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, వాటికి పండ్లు, ఫలహారాలు అందజేశారు. ఈ ఆసక్తికరమైన...