ముసాయిదా పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ వర్మ
పలమనేరు, సెప్టెంబర్ 23 ( గరుడ ధాత్రి ) : పలమనేరు పురపాలక సంఘ పరిధిలో జరగనున్న మున్సిపల్ సాధారణ ఎన్నికలు-2026 కోసం అధికార యంత్రాంగం సన్నాహాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా బుధవారం మున్సిపల్ కమిషనర్ లోకేశ్వర వర్మ పట్టణంలోని పలు ముసాయిదా పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పట్టణంలోని మొత్తం 36 వార్డులకు సంబంధించి 28 ప్రాంతాల్లో 72 ముసాయిదా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కనీస మౌలిక వసతులు కల్పించాలని ఈ...