మెడికల్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలి

-ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలి -సీపీఎం ప్రాంతీయ కార్యదర్శి ఎం. రమేష్ డిమాండ్ గరుడధాత్రి :సత్యవేడు నియోజకవర్గంలో ప్రైవేట్ మెడికల్ షాపుల అక్రమాలు రోజురోజుకు పెరుగుతున్నాయని, ప్రజల ఆరోగ్యాన్ని వ్యాపారంగా మార్చిన మెడికల్ మాఫియాపై ప్రభుత్వం వెంటనే ఉక్కుపాదం మోపాలని సీపీఎం ప్రాంతీయ కార్యదర్శి ఎం. రమేష్ డిమాండ్ చేశారు. గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, పేద మరియు మధ్యతరగతి ప్రజలు అనారోగ్యంతో ఆసుపత్రులకు వెళ్లినప్పుడు మందుల పేరుతో అధిక ధరలు వసూలు చేసి దోపిడీకి...