మేడలు, మిద్దెలు వద్దు.. ఆకలి బాధలు తీర్చండి!
*పలమనేరు, సెప్టెంబర్ 28 ( గరుడ ధాత్రి ) : గ్రామాల్లో చాలీచాలని జీతాలతో పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ) సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గిరిధర్ గుప్తా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీఆర్ఏల న్యాయమైన కోర్కెలు నెరవేర్చాలని కోరుతూ సోమవారం పలమనేరు ఆర్డీవో కార్యాలయం వద్ద వీఆర్ఏల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిధర్ గుప్తా మాట్లాడుతూ... గత రెండేళ్లుగా వీఆర్ఏల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, సమస్యలు పరిష్కరించమంటే మొద్దు నిద్ర...