మేలుమాయి ఉన్నత పాఠశాలకు పూర్వ విద్యార్థులచే 25వేల రూపాయల విలువైన టైల్స్ వితరణ
పలమనేరు, అక్టోబర్ 26 (గరుడ ధాత్రి): గంగవరం మండలంలోని మేలుమాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు తమ ఉదారతను చాటుకున్నారు. పాఠశాలకు చెందిన 2011-12 బ్యాచ్ 10వ తరగతి పూర్వ విద్యార్థులు, ఒక తరగతి గది ఫ్లోరింగ్ నిర్మాణానికి అవసరమైన రూ. 25,000 విలువైన టైల్స్‌ను సోమవారం నాడు పాఠశాలకు వితరణగా అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. పాఠశాల అభివృద్ధిపై పూర్వ విద్యార్థులు చూపిన చొరవను అభినందించారు. దాతలు అందించిన ఈ సహకారంతో ఒక...