GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 16 June 2026, 8:28 pm Posted by : GURU SWAMY

మేల్ శాంతిని కలిసిఆశీర్వాదం పొందిన బైరెడ్డిపల్లి అయ్యప్పస్వామి భక్తులు

బైరెడ్డిపల్లి గరుడదాత్రి జూన్16

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి వారి మాస పూజలలో భాగంగా మిధున మాస పూజలలో భాగంగా మంగళవారం బైరెడ్డిపల్లికి చెందిన అయ్యప్పస్వామి భక్తులు మురళీధరాచార్యుల ఆధ్వర్యంలో స్వామివారిని, మాలికాపురత్తమ్మ దేవిని దర్శించి ఆలయ ప్రధాన అర్చకులు మేల్ శాంతి శ్రీ హరి హర నంబూద్రి ని కలిసి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. మురళీధరచార్యులు క్రమం తప్పకుండా ప్రతినెల మాస పూజల దర్శనానికి వెళుతుంటారు. ఈ కార్యక్రమంలో చంగల్రాయప్ప,మణికంఠ,చెన్నకేశవులు, నవాబు తదితరులు పాల్గొన్నారు.