మే 12న తిరుమలలో హనుమజ్జయంతి వేడుకలు

తిరుమల, 2026 మే 1 మే 12న తిరుమలలో హనుమజ్జయంతి వేడుకలు ప్రతి సంవత్సరం వైశాఖ మాసం బహుళదశమినాడు తిరుమల క్షేత్రంలో ఘనంగా నిర్వహించే హనుమజ్జయంతి వేడుకలు ఈ ఏడాది మే 12వ తారీఖున టీటీడీ అత్యంత వైభవంగా నిర్వహించనుంది. శ్రీవారి ఆలయానికి ఎదురుగానున్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి, కాలినడకబాటలో ఏడవ మైలు వద్ద ఉన్న శ్రీప్రసన్న ఆంజనేయస్వామి వారికి హనుమజ్జయంతినాడు ప్రత్యేక పూజలు జరుగనున్నాయి. తిరుమలలోని జాపాలి తీర్థంలో కూడా హనుమజ్జయంతి ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించబడుతుంది. ఈ సంద‌ర్భంగా సాంప్రదాయానుసారం టీటీడీ...