మే 6న శ్రీసిటీలో క్యారియర్ ఏసీ తయారీ యూనిట్ శంకుస్థాపన చేయనున్న మంత్రి నారా లోకేష్
మే 6వ తేదీన ప్రముఖ క్యారియర్ ఏసీ తయారీ యూనిట్‌కు రాష్ట్ర విద్య, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేయనున్నారని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. శ్రీ సిటీలో శంకుస్థాపన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు హెలిప్యాడ్, భూమి పూజ స్థలం తదితర అవసరమైన ఏర్పాట్లను జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, శ్రీ సిటీ ఎండీ రవి సన్నారెడ్డి లతో కలిసి సంయుక్తంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అమెరికాకు చెందిన ప్రముఖ...