మైదుకూరులో డీఎస్సీపై వైఎస్సార్‌సీపీ టౌన్ హాల్ సమావేశం – మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి విమర్శలు
గరుడదాత్రి న్యూస్, ఆగస్టు 3: కడప జిల్లా మైదుకూరులోని వైఎస్సార్‌సీపీ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో డీఎస్సీ నియామకాల అంశంపై టౌన్ హాల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శెట్టిపల్లి రఘురామిరెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ పాలనలో ఏ ఒక్క శాఖ కూడా సమర్థవంతంగా పనిచేయడం లేదని విమర్శించారు. ముఖ్యంగా విద్యా వ్యవస్థను ప్రభుత్వం పూర్తిగా దెబ్బతీసిందని, యువత భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియలో కూడా అవినీతి...