మైదుకూరు చిన్న సాయిబాబా ఆలయంలో వైభవంగా గురుపౌర్ణమి ఉత్సవాలు
గరుడ దాత్రి న్యూస్ మైదుకూరు జులై 29 మైదుకూరు టౌన్ సాయినాథపురంలోని ప్రసిద్ధ చిన్న సాయిబాబా దేవాలయంలో గురుపౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధల నడుమ జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా ఉదయం 6 గంటలకు స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచామృతాలు మరియు సుగంధ ద్రవ్యాలతో భక్తులు స్వహస్తాలతో ఉదయపు అభిషేకం నిర్వహించారు. అధ్యక్షునికి ఘన స్వాగతం - ఊరేగింపు: ఉదయపు అభిషేకం అనంతరం ఆలయ కమిటీ సభ్యులు సాయిబాబా గుడి కమిటీ అధ్యక్షులు కరమలపుటీ సుబ్బరాయుడు నివాసానికి వెళ్లి, గురుపౌర్ణమి ఉత్సవాలకు...