GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 16 September 2026, 6:35 am Digital Edition : GURU SWAMY

మొబైల్ ఎక్స్‌రే ద్వారా ఉచిత టీబీ స్క్రీనింగ్ పధకం ను సద్వినియోగం చేసుకొండి

బైరెడ్డిపల్లి గరుడదాత్రి సెప్టెంబర్15
బైరెడ్డిపల్లి మండలంలోని తీర్థం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గంగినాయనిపల్లి ప్రాంతంలో క్షయ (TB) వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి, సకాలంలో చికిత్స అందించేందుకు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక టీబీ స్క్రీనింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
గ్రామీణ ప్రాంత ప్రజలకు టీబీ పరీక్షలు అందుబాటులో ఉండేలా మొబైల్ ఎక్స్‌రే యంత్రం ద్వారా ఉచితంగా ఛాతీ ఎక్స్‌రే పరీక్షలు నిర్వహిస్తున్నారు కావున ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని విద్య అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ టీబీ నిర్మూలన కార్యక్రమాల కింద ప్రజలకు ఈ సేవలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయని వైద్య సిబ్బంది తెలిపారు.
V. కోట డివిజన్‌లో ఒక మొబైల్ ఎక్స్‌రే యంత్రం ద్వారా ప్రజలకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొదటి దశలో సుమారు 370 మందికి పరీక్షలు నిర్వహించగా, టీబీ యూనిట్ పరిధిలో ఇప్పటివరకు 68 మంది టీబీ అనుమానితులను గుర్తించి వైద్య సేవలకు అనుసంధానం చేసినట్లు తెలిపారు.
టీబీ ప్రధాన లక్షణాలు
కింది లక్షణాలు రెండు వారాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం కొనసాగితే ప్రజలు తప్పనిసరిగా సమీపంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించి టీబీ పరీక్షలు చేయించుకోవాలి:
రెండు వారాలకు మించి దగ్గు ఉండటం
జ్వరం, ముఖ్యంగా సాయంత్రం సమయంలో జ్వరం రావడం
బరువు తగ్గడం
ఆకలి తగ్గడం
రాత్రిపూట అధికంగా చెమటలు పట్టడం
ఛాతీ నొప్పి లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
కఫంలో రక్తం పడటం
టీబీ అనుమానం ఉన్న వారు ఈ అవకాశం ను ఉపయోగించుకోవాలని వారు తెలిపారు. మొబైల్ ఎక్స్‌రే ద్వారా ఉచిత ఛాతీ ఎక్స్‌రే చేయడంతో పాటు అవసరాన్ని బట్టి ఆధునిక పరీక్షలు నిర్వహించి వ్యాధిని నిర్ధారిస్తారు. వ్యాధి నిర్ధారణ అయిన వారికి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల ద్వారా ఉచితంగా టీబీ చికిత్స మరియు అవసరమైన వైద్య సేవలు అందిస్తారు.
ప్రధాన్ మంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ తో పాటు జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం లక్ష్యాలకు అనుగుణంగా, ప్రజల్లో టీబీపై అవగాహన కల్పించడం, అనుమానితులను ముందుగానే గుర్తించడం, పరీక్షలు నిర్వహించడం మరియు నిర్ధారణ అయిన వారికి సకాలంలో చికిత్స అందించడం జరుగుతోంది అన్నారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ పద్మావతి, హరిప్రసాద్ – టీబీ సూపర్‌వైజర్, కిషోర్ – టీబీ సూపర్‌వైజర్, సమంతకమని – రాజారెడ్డి, దివ్య, ప్రతిమ,ఎం.ఎల్ హెచ్.పిలు, రెడ్డెమ్మ, అరెమ్మ – ఆశా కార్యకర్తలు మరియు ఇతర వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.