GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 16 September 2026, 6:41 am Digital Edition : GURU SWAMY

మోక్ష గణపతి ఆలయంలో విశేష పూజలు

చౌడేపల్లి సెప్టెంబర్ 15 గరుడ దాత్రి న్యూస్

మండలంలోని పంచాయతీ కేంద్రం శెట్టిపేట లో గల మోక్ష గణపతి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు వినాయక చవితిని పురస్కరించుకుని ఆలయ నిర్మాణ దాత మాదిరాజు లక్ష్మణరాజు పతిరాజు దంపతులు ఆధ్వర్యంలో పలు పూజా కార్యక్రమాలు జరిగాయి వేద పండితుల ఆధ్వర్యంలో ఘనపయ్యకు తొలి పూజ చేసి విశేష అభిషేకాలు పూజలు జరిగాయి ఆ తర్వాత 11వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని చుట్టుపక్కల గ్రామాలలో స్వామి వారు ఊరేగారు ఇందులో భాగంగా ఆలయంలో తయారు చేయబడ్డ లడ్డుకు మంచి గిరాకీ ఏర్పడింది వేలంపాటలో రెడ్డి రూ 1,49,116లు కుడుముల హారాన్ని సురేష్ 32వేలకు పాడి దక్కించుకున్నారు ఈ ప్రాంతం వారే కాకుండా చుట్టుపక్కల వారు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు నిర్వాహకులు అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు