“యువగళం” అను బంధం చిరస్థాయిగా నిలుస్తుంది..

-పాదయాత్ర సహచరులను పేరుపేరునా పలకరించిన మంత్రి నారా లోకేష్* తన వెంట నడిచిన కార్యకర్తలను ఎన్నటికీ మరిచిపోనని మరోసారి చాటిచెప్పారు రాష్ట్ర మంత్రి నారా లోకేష్. ఏ వేదికైనా, ఏ కార్యక్రమమైనా యువగళం పాదయాత్రలో తనతో పాటు నడిచిన కార్యకర్తలు కనిపిస్తే వారిని పేరుపేరునా పలకరించి, ఆప్యాయంగా మాట్లాడటం ఆయన ప్రత్యేకతగా నిలుస్తోంది. యువగళం బంధం కేవలం పాదయాత్రతో ముగిసేది కాదని, అది చిరస్థాయి అనుబంధమని మరోసారి నిరూపించారు. కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి వివాహ సందర్భంగా తిరుపతిలోని వధువు నివాసానికి...