GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 08 May 2026, 8:06 am Posted by : GARUDA DHATRI NEWS

రథోత్సవానికి విద్యుత్ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు

రథోత్సవానికి విద్యుత్ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు

నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం స్వామివారి రథోత్సవం తిరువీధుల్లో వైభవంగా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
రథోత్సవం సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, భద్రతా దృష్ట్యా ఆలయ మాడ వీధుల్లో ఉన్న విద్యుత్ వైర్లను తాత్కాలికంగా తొలగించి విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని నాగలాపురం విద్యుత్ శాఖ ఏఈ పృథ్వీ వెల్లడించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండి విద్యుత్ శాఖ అధికారులకు సహకరించాలని ఆయన కోరారు. స్వామివారి రథోత్సవం ప్రశాంతంగా, భక్తిశ్రద్ధల మధ్య విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు.
రథోత్సవం ముగిసిన అనంతరం యథావిధిగా విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని విద్యుత్ శాఖ అధికారులు స్పష్టం చేశారు.