రాజ్యసభ అభ్యర్థులకు బీ-ఫారంలు అందజేసిన చంద్రబాబు

అమరావతి, జూన్ 7 గరుడధాత్రి : తెలుగుదేశం పార్టీ తరపున రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపికైన చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ, సానా సతీష్లకు టీడీపీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీ-ఫారంలను అందజేశారు. పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అభ్యర్థులను అభినందించిన చంద్రబాబు నాయుడు, పార్టీ సిద్ధాంతాలు, ప్రజా ఆకాంక్షలను రాజ్యసభలో సమర్థవంతంగా వినిపించాలని ఆకాంక్షించారు. పార్టీ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ రాష్ట్ర ప్రయోజనాల కోసం కృషి చేయాలని సూచించారు. రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపికైన ముగ్గురు నాయకులు పార్టీ అధినేతకు...