GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 09 June 2026, 6:36 am Posted by : GARUDA DHATRI NEWS

రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఐటీడీపీ నేతలు

విజయవాడ, జూన్ 8: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆయన సతీమణి శ్రీమతి పద్మావతి, అలాగే ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా నియమితులైన చింతకాయల విజయ్లను విజయవాడలోని వారి నివాసంలో తిరుపతి పార్లమెంట్ ఐటీడీపీ అధ్యక్షుడు యాచేంద్ర నాయుడు, ఐటీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జి. నాగేంద్ర నాయుడు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా యాచేంద్ర నాయుడు మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, పార్టీ బలోపేతం కోసం చింతకాయల కుటుంబం అందిస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. స్పీకర్‌గా చింతకాయల అయ్యన్నపాత్రుడు తన రాజకీయ అనుభవం, పరిపాలనా దక్షతతో రాష్ట్రానికి విశిష్ట సేవలు అందిస్తున్నారని కొనియాడారు.
అలాగే, యువ వయస్సులోనే రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టిన చింతకాయల విజయ్కు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఆయన నాయకత్వం, అంకితభావం, ప్రజాసేవా దృక్పథం రాజ్యసభలో రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్ర హక్కుల సాధన, యువత సంక్షేమం, ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల్లో మరింత కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛాలు అందజేసి, తిరుమల శాలువాతో సత్కరించి, తిరుమల లడ్డూ అందించి అభినందనలు తెలియజేశారు.
రాష్ట్రానికి, పార్టీకి మరిన్ని విశిష్ట సేవలు అందిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించినట్లు తెలిపారు.