రాత్రివేళల్లో అక్రమ నిర్మాణాలు..! కనిపించని అధికారులు..!
సత్యవేడు, జూన్ 4 గరుడధాత్రి : సత్యవేడు పట్టణంలోని కోటమిట్ట ప్రాంతంలో పేదలకు కేటాయించిన భూముల్లో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. సుమారు 19 సెంట్ల భూమికి సంబంధించిన పేదల పట్టా భూమికి న్యాయం చేయాలని బాధితులు అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ, సమస్యకు పరిష్కారం కనిపించడం లేదని వాపోతున్నారు. ఈ భూములు ప్రభుత్వ భూములుగా ఉండి, పేదలకు పట్టాలు మంజూరు చేసినప్పటికీ ప్రస్తుతం ఆక్రమణలకు గురయ్యాయని స్థానికులు చెబుతున్నారు. అంతేకాకుండా, ఈ భూముల క్రయవిక్రయాలు కూడా జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ...