* ప్రణాళికాబద్ధంగా కుప్పం నియోజకవర్గ సమగ్ర ప్రగతి.
* కుప్పం నియోజకవర్గంలో పాల ఉత్పత్తి భారీగా పెరిగింది.
* కుప్పం నియోజకవర్గంలో పాలకు సంబంధించిన 2 కంపెనీలు.
* 1800 హెక్టార్లకు మిల్లెట్ పంట విస్తరణ.
* 900 కోట్లతో మూడు సబ్ స్టేషన్లు.
* 32 పరిశ్రమల ఆగమనం-88 వేల ఉద్యోగాలకు అవకాశం.
* కుప్పం బెంగళూరుకు శాటిలైట్ రింగ్ రోడ్డు.
* మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్.
కుప్పం,ఆగస్టు 05 (గరుడ ధాత్రి న్యూస్): రాబోయే 25 ఏళ్ల కాలంలో కుప్పం ను పెద్ద సిటీగా మార్చడమే లక్ష్యంగా ముందుకు పోతున్నామని కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్ వికాస్ మర్మత్ వెల్లడించారు. బుధవారం మధ్యాహ్నం కుప్పంలోని కడ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కుప్పం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక పై వివరాలను వెల్లడించారు.కుప్పం నియోజక వర్గంలో 32 కంపెనీల ఏర్పాటు జరుగుతుందన్నారు. పరిశ్రమల ఆగమనం ద్వారా ప్రత్యక్ష, పరోక్షంగా 88 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయన్నారు. కుప్పం నియోజకవర్గం లోరూ. 900 కోట్లతో 3 సబ్స్టేషన్ లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
కుప్పం – బెంగళూరుకు శాటిలైట్ రింగ్ రోడ్డు మంజూరు అయిందన్నారు.రాబోయే రెండేళ్లలో కుప్పంలోని కంపెనీలకు బయట నుండి పనిచేయడానికి ఉద్యోగస్తులు వస్తారన్నారు.1000 మందికి గృహాలు నిర్మించుకోవడానికి హౌసింగ్ సైట్లు మంజూరు చేస్తున్నామన్నారు.రాబోయే మార్చిలోపు 50 వేల మంది గృహాలకు సోలార్ ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తామని వివరించారు. కుప్పం నియోజకవర్గంలో
త్వరలోనే నెట్ వర్క్ ఇష్యూలను పూర్తి చేస్తామన్నారు. నియోజకవర్గంలో40 శాతం రోడ్డు పనులను పూర్తి చేశామన్నారు.130 ఈ- ఆటోల ద్వారా చెత్త సేకరణ చేపడుతున్నామని,
రాష్ట్రంలోనే కుప్పం రూరల్ చెత్త సేకరణ కార్యక్రమంలో 5 వ స్థానంలో ఉందన్నారు.
50 హైమాస్ లైట్లను ఏర్పాటు చేశామని, ఎల్పిజి క్రిమోటోరియం పనులను పూర్తి చేసి, ప్రారంభించడం జరిగిందన్నారు. కుప్పం ఎంట్రెన్స్ ఆర్చీని ప్రారంభించడం జరిగిందన్నారు.కుప్పంలో మరో 2 ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేస్తామన్నారు.
కుప్పంలో ఎన్టీఆర్ స్పోర్ట్స్ స్టేడియం ను పూర్తి స్థాయిలో నిర్మిస్తున్నామన్నారు.
కుప్పం పట్టణంలో అండర్ డ్రైనేజ్ త్వరలోనే పనులు ప్రారంభమవుతుందన్నారు.
కుప్పం పట్టణంలో రూ. 5 కోట్లతో సుందరీకరణ పనులు చేస్తామన్నారు.నవంబర్ లో కుప్పం మాస్టర్ ప్లాన్ ను విడుదల చేస్తామన్నారు.
రాబోయే సంవత్సరంలో ప్రపంచ స్థాయి రైతు బజార్ రాబోతుందన్నారు.హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తి చేశామని,
550 ట్యాంకులకు సంబంధించి 127 ట్యాంకులకు నీటి సరఫరా జరుగుతోందన్నారు.రామకుప్పంలోని ననీయాలలో రిసార్ట్ మరియు తదితర పనులను పూర్తి చేసి, 9 నెలలో పూర్తి చేస్తామన్నారు.కనకనాచమ్మ ఆలయం వద్ద బోటింగ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.
కుప్పంలో మోడ్రన్ ఆర్టీసీ బస్టాండ్ పనులను చేపడతామన్నారు. కుప్పం నియోజకవర్గంలో విమానాశ్రయం సైతం ఏర్పాటు కానుంది అన్నారు. సంజీవిని ప్రాజెక్టు గురించి వివరించారు.