రామగిరిలో భక్తి ప్రపత్తులతో ఆదివారం అమావాస్య పూజలు
పిచ్చాటూరు మండలం రామగిరి లో వెలసియున్న శ్రీ అంకాలపరమేశ్వరి ఆలయంలో ఆదివారం అమావాస్య ను పురస్కరించుకొని రాత్రి ప్రత్యేక అమావాస్య పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సాయంత్ర అమ్మవారి మూల విరాట్ కు ప్రత్యేకంగా పంచామృతాలతో అభిషేకించి, గజ మాలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అందంగా అలంకరించిన అమ్మవారి ఉత్సవ మూర్తిని ఆలయ ఊంజల్ మండపంలో ఉయ్యాల పై అధిష్టించి ఊంజల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో మంగళ వాయిద్యాలు, చిన్నారుల పండరి భజన ఆకర్షణగా నిలిచింది. ఆదివారం...