GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 01 October 2026, 9:18 pm Digital Edition : GURU SWAMY

రామనపల్లి ఎస్ఎంసీ చైర్మన్‌గా వేణుగోపాల్‌రెడ్డి వైస్‌ చైర్మన్‌గా రెడ్డమ్మ ఎంపిక

*రామనపల్లిలో వైసీపీ శ్రేణుల సంబరాలు

బైరెడ్డిపల్లి గరుడదాత్రి అక్టోబర్1

బైరెడ్డిపల్లి మండలం లో సెప్టెంబర్29 న రామనపల్లి లో పాఠశాల యాజమానమన్య కమిటీ ఎన్నిక వాయిదా పడ్డ సంఘటన తెలిసిందే.మండలం లోని 81 పాఠశాలలల్లో ఎస్.ఎం.సి.ఎన్నికలు ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు.కాని రామనపల్లి ఎస్.ఎం.సి ఎన్నిక వాయిదాపడింది. ఈ నేపథ్యంలో గురువారం పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికలు జిల్లాఅధికారుల పర్యవేక్షణలోప్రశాంతంగానిర్వహించారు.లక్కనపల్లి పంచాయతీ పరిధిలోని రామనపల్లి గ్రామంలోని పాఠశాలలో నిర్వహించిన ఎన్నికల్లో చైర్మన్‌గా వేణుగోపాల్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌గా రెడ్డమ్మ ఎన్నికయ్యారు.
జి సి డి ఓ కృష్ణవేణి చిత్తూరు ఎంఈఓ వేణుగోపాల్ రెడ్డి ఎంఈఓ 2 దేశమ్మ పాఠశాల ప్రధానోపాధ్యాయులు పార్థసారథి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. ఎన్నికల అనంతరం చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌గా ఎంపికైన వారిని వైసీపీ నాయకులు, కార్యకర్తలు అభినందించారు.
ఈ సందర్భంగా రామనపల్లి గ్రామంలో వైసీపీ శ్రేణులు స్వీట్లు పంపిణీ చేసి ఆనందం వ్యక్తం చేశారు. చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులు తమ పార్టీకి చెందిన సభ్యులకు దక్కడంతో గ్రామంలో
రఘురామిరెడ్డి, ఆనంద్ రెడ్డి , సుబ్రమణ్యం రెడ్డి, లక్ష్మణ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, సోమశేఖర్ రెడ్డి కే మధు. రోషన్ కుమార్ రెడ్డి, ఓబుల్ రెడ్డి ఈశ్వర్ గౌడ్, వెంకటరమణగౌడు మధు నాగేందర్ రెడ్డి, గోపాల్ గౌడు మణి,విశ్వనాథరెడ్డి శివప్ప గౌడు జహీర్ భాషా, లతీఫ్, సురేష్ రెడ్డి సంబరాలు చేసుకున్నారు. పలువురు వైకాపా పార్టీ నాయకులు, కార్యకర్తలు నూతనంగా ఎన్నికైన చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
.