Date of Publish : 02 May 2026, 8:56 pmDigital Edition : GURU SWAMY
రాయలసీమలో సెమీకండక్టర్ విప్లవం.. “సిలికాన్ సీమ”గా మారనున్న ప్రాంతం
రాయలసీమ అభివృద్ధిలో మరో కీలక అడుగు పడుతోంది. శ్రీ సత్యసాయి జిల్లాలో సంస్థ రూ.10,239 కోట్ల భారీ పెట్టుబడితో సెమీకండక్టర్ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. దీంతో రాయలసీమ “సిలికాన్ సీమ”గా అవతరించబోతోందని తెలుగుదేశం పార్టీ కేవీబీ పురం మండల అధ్యక్షుడు ఎం. మునస్వామి యాదవ్ తెలిపారు.
ఈ ప్రాజెక్ట్ ద్వారా వెయ్యికి పైగా హై-ఎండ్ ఉద్యోగాలు లభించనున్నాయి. బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలకు ఉద్యోగాల కోసం వెళ్లే యువతకు ఇది ఊరటనివ్వనుంది. గ్లోబల్ టెక్నాలజీ మ్యాప్‌లో రాయలసీమకు ప్రత్యేక స్థానం కల్పించే ఈ పెట్టుబడి ప్రాంత అభివృద్ధికి కొత్త దిశను చూపనుంది.
కియా పరిశ్రమ తర్వాత ఇప్పుడు సెమీకండక్టర్ రంగంలో భారీ పెట్టుబడులు రావడం రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు