రాయలసీమ హార్టికల్చర్ హబ్’.. సభా ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు, ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి
పలమనేరు, అక్టోబర్ 01 ( గరుడ ధాత్రి ) : మదనపల్లె వేదికగా ఒక భారీ ప్రాజెక్టుకు ప్రతిష్టాత్మకంగా దాదాపు రూ. లక్ష కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న 'రాయలసీమ హార్టికల్చర్ హబ్' శంకుస్థాపన కార్యక్రమానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ బృహత్తర ప్రాజెక్టుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లు ముఖ్య అతిథులుగా విచ్చేసి తమ చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న...