రాష్ట్రవ్యాప్తంగా 5 వేల ఆలయాల నిర్మాణం -దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
గరుడధాత్రి : రాష్ట్రంలో రాబోయే మూడు సంవత్సరాల్లో శ్రీవాణి ట్రస్టు ద్వారా 5 వేల ఆలయాల నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామని ఆయన తెలిపారు. ఆలయ నిర్మాణానికి అవసరమైన స్థల విస్తీర్ణాన్ని బట్టి నిధులు మంజూరు చేయనున్నట్లు మంత్రి వివరించారు. పది సెంట్లలోపు స్థలం ఉంటే రూ.20 లక్షలు, 15 సెంట్ల స్థలం ఉంటే రూ.30 లక్షలు, 20 సెంట్ల స్థలం ఉంటే రూ.40 లక్షల వరకు ఆర్థిక...