GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 02 October 2026, 9:21 pm Digital Edition : GURU SWAMY

రాష్ట్ర ప్రభుత్వం చే స్వచ్ఛ ఆంధ్ర అవార్డు 2026 ప్రధానం

* సాయి మత సేవా ట్రస్టు జగదీష్ బాబుకు అవార్డు ప్రధానం.
చిత్తూరు బ్యూరో, అక్టోబర్ 02 (ఆర్.సృఫీనివాసులు,గరుడ ధాత్రి న్యూస్): కుప్పంలోని శ్రీ సాయి మాతా సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు జగదీష్ బాబు స్వచ్ఛ ఆంధ్ర 2026 అవార్డు ను అందుకున్నారు.జాతిపిత మహాత్మా గాంధీ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్ 2026 ను జిల్లా స్థాయిలో స్వచ్ఛత మరియు పరిశుభ్రత పట్ల ప్రజలకు విద్యార్థులకు అవగాహన మరియు చైతన్యం ప్రజలను భాగస్వామ్యం కల్పిస్తూ నిరంతరం సేవలను కొనసాగిస్తున్న సాయి మాత సేవ ట్రస్ట్ వారు స్వచ్ఛత పరిశుభ్రత భాగంగా చేసిన సేవల గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వచ్ఛ ఆంధ్ర అవార్డు 2026 ను చిత్తూరుపార్లమెంట్ సభ్యులు దగ్గు మల్ల ప్రసాద్ రావు, మరియు చిత్తూరు ఎమ్మెల్యేగురజాల జగన్ మోహన్ నాయుడు మరియు ముఖ్య అతిథుల చేతుల మీదుగా చిత్తూరు జడ్పీ హాల్ నందు అందజేయబడింది.