GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 19 June 2026, 7:22 am Posted by : GURU SWAMY

రాష్ట్ర వ్యాప్తంగా 43 మoది వైద్యుల డిస్మిస్

-మరో 34 మంది రాజీనామాల సమర్పణ

-అనధికారికంగా విధులకు దూరంగా ఉన్న వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదు

-రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి
✍️
ప్రభుత్వ వైద్య సేవలకు దూరంగా అనధికారికంగా విధులకు గైర్హాజరీలో ఉన్న 43 మంది వైద్యుల(సివిల్ అసిస్టెంట్ సర్జన్) పై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కఠిన చర్యలకు ఉపక్రమించింది. గరిష్టంగా నాలుగేళ్ల నుంచి విధులకు రాకుండా ఉన్న వీరికి నిబందనలు అనుసరించి సంజాయిషీ నోటీసుల జారీతోపాటు అభియోగాలు నమోదు చేసినప్పటికీ స్పందన లభించనందున విధుల నుంచి శాశ్వతంగా తప్పించాలని నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఓ ప్రకటన జారీచేశారు. గతనెలలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని బోధనాసుపత్రుల్లో పనిచేసే వైద్యుల్లో 51 మంది అనధికారికంగా విధులకు దూరంగా ప్రభుత్వ నిబంధనలు అనుసరించి తప్పించారు. ఇదేవిధంగా ప్రస్తుతం డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ పరిధిలోనూ జరిగేందుకు అవసరమైన చర్యలు తుదిదశకు చేరుకున్నాయి. వీరిలో జనరల్ మెడిసిన్, ఆర్థో, గైనిక్ ఇతర వైద్యులు ఉన్నారు

మరో 34 మంది రాజీనామాల సమర్పణ

వాస్తవానికి 118 మంది పర్మినెంట్ వైద్యులు అనధికారికంగా విధులకు దూరంగా ఉన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏడాదికి మించి అనధికారికంగా విధులకు దూరంగా ఉంటే విధుల నుచి తప్పించవచ్చు. వీరిపై ప్రభుత్వ నిబంధన అనుసరించి అధికారులు చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగానే 43 మంది వైద్యులను శాశ్వతంగా విధుల నుంచి తప్పించే ప్రక్రియ మొదలైంది. ఈ 43 మంది కాకుండా మరో 34 మంది వైద్యులు సంజాయిషీ నోటీసులు జారీ, అభియోగాల నమోదు అనంతరం రాజీనామాలు చేశారు. వీరిలో 15 మంది రాజీనామాలను ప్రభుత్వం ఆమోదించబోతుంది. అభియోగాల నమోదు అనంతరం మిగిలిన 19 మంది రాజీనామాలు చేసినందున క్రమశిక్షణ (సీసీఏ రూల్సు-1991) చర్యల్లో భాగంగా జిల్లాల వారీగా 11 మంది విచారణ అధికారులను నియమించారు. వీరి సదరు వైద్యుల నుంచి వివరణ కోరి, ఇచ్చే నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటామని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ చక్రధరబాబ వెల్లడించారు. అభియోగాల నమోదు అనoతరం మరో 19 మంది వైద్యులు వ్యక్తిగత కారణాలవల్ల విధులకు హాజరుకాలేదని వివరణ ఇచ్చారు. దీనిపై విచారణ జరగనుంది. సంజాయిషీల నోటీసులు జారీ జరిగిన తర్వాత 9 మంది CASlu విధుల్లో చేరారు. మరో 13 మంది వైద్యుల అభ్యర్ధనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి.