GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 19 June 2026, 9:06 pm Posted by : GARUDA DHATRI NEWS

రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్ మనక్ సైన్స్ ప్రదర్శనకు ఎంపికైన మేలుమాయి విద్యార్థి ప్రాజెక్ట్

పలమనేరు, జూన్ 19 ( గరుడ ధాత్రి ) :

మండలంలోని మేలుమాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న సుశాంత్ కుమార్ రెడ్డి అనే విద్యార్థి “ఇన్స్పైర్ మనక్ 2024-25 కు సంబంధించి”మ్యావ్ మ్యావ్.. ష్ ష్.. టప్ టప్”అని సైన్స్ ప్రాజెక్ట్ ను జిల్లా స్థాయిలో సమర్పిస్తే అది రాష్ట్రస్థాయి ప్రదర్శనకు ఎంపికైంది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు శ్రీధర్ బాబు మాట్లాడుతూ….. ఈ ప్రాజెక్టు ద్వారా ఎలుకలు నుండి, పాముల నుండి పంటలను ఎలా రక్షించుకోవాలో తెలుస్తుందని, ఈ ప్రాజెక్టును “నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్” అనే సంస్థ ఆన్లైన్ మూల్యాంకనం ద్వారా రాష్ట్రస్థాయి ప్రదర్శనకు ఎంపిక చేసిందని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు గైడ్ టీచర్లుగా వ్యవహరించిన భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు దేవకుమార్, జీవశాస్త్ర ఉపాధ్యాయులు నాగరత్నాలను సహచర ఉపాధ్యాయులు, విద్యా కమిటీ సభ్యులు మరియు విద్యార్థులు అభినందించారు. జిల్లా వ్యాప్తంగా 25 ప్రాజెక్టులను ఎంపిక చేస్తే అందులో గంగవరం నుండి ఈ పాఠశాల ప్రాజెక్టు ఎంపికైనందులకు సహకరించిన జిల్లా సైన్స్ అధికారి గారికి , మండల, జిల్లా విద్యాశాఖ అధికారులకు ప్రధానోపాధ్యాయులు ధన్యవాదములు తెలిపారు.