రీ-సర్వేపై రైతులకు అవగాహన కల్పించిన తాసిల్దార్
పిచ్చాటూరు, ఆగస్టు 1 గరుడధాత్రి : పిచ్చాటూరు మండలం గోవర్ధనగిరి, ముడియూరు సచివాలయాల్లో చేపట్టనున్న రీ-సర్వే కార్యక్రమంలో భాగంగా శనివారం రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తాసిల్దార్ వై. చంద్రబాబు నాయుడు రైతులకు రీ-సర్వే ప్రక్రియ, భూ హద్దుల నిర్ధారణ, రికార్డుల సవరణ, భూ వివాదాల పరిష్కారానికి రీ-సర్వే ప్రాధాన్యత గురించి వివరించారు. రీ-సర్వే సమయంలో రైతులు తమకు సంబంధించిన భూ పత్రాలు, అవసరమైన రికార్డులను సిద్ధంగా ఉంచాలని, సర్వే బృందానికి పూర్తి సహకారం అందించాలని సూచించారు. భూముల కొలతల సమయంలో ఏవైనా...