దుర్గా నగర్ కాలనీలో సీసీ కెమెరాలు ప్రారంభం
-చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్
చిత్తూరు సెప్టెంబర్ 13 (గరుడదాత్రిన్యూస్)చిత్తూరు సమగ్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, చిత్తూరులో మౌళిక సదుపాయాల అభివృద్ధి కోసం సీఎం కి విన్నవిస్తే రూ.110 కోట్లు మంజూరు చేశారని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. ఆదివారం చిత్తూరు దుర్గా నగర్ కాలనీలో స్థానిక తెదేపా నేత వరుణ్ కుమార్ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమాజం కోసం మంచి చేసేవారు ముందుకు వచ్చి అభివృద్ధి పనులకు తోడ్పాటు అందిస్తే ఆ ప్రాంతాలు మరింత వేగంగా అభివృద్ధి చెందుతాయన్నారు. స్థానిక దుర్గా నగర్ కాలనీలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంఅభినందనీయన్నారు. ఇదే స్పూర్తితో మిగిలిన ప్రాంతాల్లోనూ స్థానిక నాయకులు,వ్యాపారవేత్తలు ముందుకొచ్చి అభివృద్ధి పనులకుచేయూతఅందించాలన్నారు. చిత్తూరు అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. ఇప్పటికే నగరంలో ప్రధాన రోడ్లన్నీ అభివృద్ధి చేస్తున్నామని, తాజాగా సీఎం గారు రూ.110 కోట్లు మంజూరు చేసినట్లు వివరించారు. ఇందులో రూ.80 కోట్లు రోడ్ల అభివృద్ధికి, రూ.20కోట్లు లైట్లకు, రూ.10కోట్లు డ్రైనేజీల నిర్మాణం కోసం మంజూరు చేసినట్లు చెప్పారు. ఇదివరకే పురపాలక శాఖ మంత్రి గారు డ్రైనేజీల నిర్మాణం కోసం రూ.80 కోట్లు మంజూరు చేశారని గుర్తు చేశారు. చిత్తూరులో గతంలో ఎన్నడూ జరిగినంతగా అభివృద్ధి పనులుజరుగుతున్నాయన్నారు.
పని పాట లేకుండా విమర్శలు చేస్తున్నారు
.
చిత్తూరులో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కొందరు అనవసర విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. రాజకీయాలు చేయడానికి రాలేదని.. తనపై నమ్మకంతో ఎమ్మెల్యేగా ఎన్నుకొన్న ప్రజలకు మంచి చేయాలని ఉద్దేశంతో పని చేస్తూ ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. కానీ కొందరు అదే పనిగా చిల్లర రాజకీయాలు చేస్తూ, పని పాట లేకుండా, నిజానిజాలుతెలుసుకోకుండా అనవసర విమర్శలు చేస్తున్నారన్నారు. చిత్తూరు ప్రజల సంక్షేమం కోసం చేసిన శ్రీనివాస కళ్యాణం పైనా విమర్శలు చేయడం వారివిజ్ఞతకేవదిలేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెదేపా నాయకులు వరుణ్ కుమార్, ఈశ్వరరావు, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.