* చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్.
కుప్పం, సెప్టెంబరు 19(గరుడ ధాత్రి న్యూస్):రెండు రోజుల కుప్పం పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాకు రానున్నారని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. సీఎం పర్యటన వివరాలను శనివారం తెలిపారు.
సెప్టెంబరు 21, 22 తేదీల్లో కుప్పం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొని, వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన నిమిషానిమిషం కార్యక్రమ వివరాలను జిల్లా కలెక్టర్ వెల్లడించారు.సెప్టెంబరు 21న ముఖ్యమంత్రి కార్యక్రమాలు:
ఉదయం 10 గంటలకు బెంగళూరు విమానాశ్రయం నుండి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి10:30 గంటలకు చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం తుమ్సి గ్రామంలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.
10:30 నుంచి 10:45 గంటల వరకు ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు ముఖ్యమంత్రికి స్వాగతం పలుకుతారు.10:45 గంటలకు తుమ్సి హెలిప్యాడ్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి
10:55 గంటలకు శాంతిపురం మండలం గుండిశెట్టిపల్లి గ్రామంలోని హెచ్ ఎన్ ఎస్ ఎస్ కాలువ వద్దకు చేరుకుంటారు.
10:55 నుంచి 11:15 గంటల వరకు కాలువ వద్ద నిర్వహించే జలహారతి కార్యక్రమంలో పాల్గొంటారు.11:15 గంటలకు కాలువ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి
11:30 గంటలకు కుప్పం మున్సిపాలిటీ తంబిగానిపల్లెలో ఇండియన్ గ్యాస్ గోడౌన్ సమీపంలోని బీసీఎన్ గ్రాండ్ ఎదురుగా ఏర్పాటు చేసిన కార్యక్రమ వేదికకు చేరుకుంటారు.11:30 నుంచి 11:45 గంటల వరకు రైతు బజార్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. 11:45 గంటలకు కార్యక్రమ వేదిక నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి
11:50 గంటలకు కుప్పం మున్సిపాలిటీ కొత్తపేటకు చేరుకుంటారు.11:50 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ప్రజా బహిరంగ సమావేశంలో పాల్గొని, వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు.
మధ్యాహ్నం 1:30 నుంచి 2:30 గంటల వరకు కార్యక్రమాలు రిజర్వ్‌డ్‌గా ఉంటాయి.2:30 నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు అభివృద్ధి ప్రాజెక్టులు, కార్యక్రమాల గ్యాలరీని సందర్శిస్తారు.4:00 గంటలకు కొత్తపేట నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి4:15 గంటలకు శాంతిపురం మండలం కడపల్లె గ్రామంలోని నివాసానికి చేరుకుంటారు.5.30 నుండి 6 వరకు ముఖ్యమంత్రి నివాసం వద్ద ఆదిత్య బిర్లా అధికారులతో, నేషనల్ నేషనల్ హైవే అధికారులతో, జిల్లా ఫారెస్ట్ అధికారులతో సమావేశం నిర్వహిస్తారు.రాత్రి 9:30 గంటలకు: కడపల్లె నివాసం నుంచి రోడ్డు మార్గంలో కుప్పం రైల్వే స్టేషన్‌కు బయలుదేరి
9:45 గంటలకు కుప్పం రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు.
రాత్రి 9:45 నుంచి 11:00 గంటల వరకు: 11005 నంబర్ దాదర్–పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్ రైలు ఫ్లాగ్‌ఆఫ్ కార్యక్రమంలో పాల్గొంటారు.రాత్రి 11:00 గంటలకు: కుప్పం రైల్వే స్టేషన్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి
11:15 గంటలకు సంతిపురం మండలం కడపల్లె గ్రామంలోని నివాసానికి చేరుకుంటారు.
సెప్టెంబరు 22న ముఖ్యమంత్రి కార్యక్రమాలు:ఉదయం 10:55 గంటలకు: కడపల్లె గ్రామంలోని నివాసం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి11:00 గంటలకు నివాసానికి ఎదురుగా శాంతిపురం మండలంలో ఏర్పాటు చేసిన కార్యక్రమ వేదికకు చేరుకుంటారు.
11:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీ హెచ్ ఏ ఎం ప్రాజెక్టులు, ఈసీ పౌల్ట్రీ షెడ్లను ప్రారంభించే కార్యక్రమంలో పాల్గొంటారు.
మధ్యాహ్నం 12 గంటల నుండి1 వరకు సోషల్ మీడియా ప్రతినిధులతో ముఖ్యమంత్రి నివాసం వద్ద సమీక్ష
మధ్యాహ్నం 1:00 గంటలకు కార్యక్రమ వేదిక నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి
1:05 గంటలకు కడపల్లె గ్రామంలోని నివాసానికి చేరుకుంటారు.మధ్యాహ్నం 1.30 గంటలకు నివాసం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరుతారు.
మధ్యాహ్నం1:35 గంటలకు తుమ్సి గ్రామంలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.
1.40 గంటలకు తుమ్సి హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్‌లో తిరుగు పయనం కానున్నారు.