రెండేళ్లైనా అమలు కాని హామీలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బాలాజీ రెడ్డి..!

సత్యవేడు జూన్ 05 గరుడధాత్రి : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లు గడిచినా అమలు చేయలేదని ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ నాయకులు గురువారం సత్యవేడులో నిరసన కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు స్థానిక వైఎస్సార్ విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఏవియం బాలాజీ రెడ్డి పాల్గొని ప్రభుత్వ విధానాలను విమర్శించారు. ఈ సందర్భంగా బాలాజీ రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు భృతి అందిస్తామని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు...