GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 02 August 2026, 8:06 am Digital Edition : GURU SWAMY

రెండేళ్ల ప్రభుత్వ పాలనపై ప్రజల్లో సంతృప్తి -ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్

చిత్తూరు ఆగస్టు 1 (గరుడ దాత్రి న్యూస్)

గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో సంతృప్తి వ్యక్తం అవుతుందని, ఇంటింటికి వెళ్తున్న సమయంలో ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. “రెండేళ్ల ప్రభుత్వ పాలన – ఇంటింటి ప్రచారం” కార్యక్రమంలో భాగంగా శనివారం చిత్తూరు రూరల్ మండలం అనంతాపురం, శెట్టితంగాల్, పెరుమాళ్ల కండ్రిగ, సిద్ధంపల్లి గ్రామాల్లో పర్యటించారు. స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. గడిచిన రెండేళ్లలో చిత్తూరు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇంటింటి ప్రచారం కార్యక్రమంలో భాగంగా ప్రజల వద్దకు వెళుతున్న సమయంలో వారి నుంచి అపూర్వ స్పందన వస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజల సంతృప్తి, సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో పరిశీలకులు కుమారి, మండల పార్టీ అధ్యక్షులు రఘు, కూటమి నాయకులు చంద్ర ప్రకాష్, జయచంద్ర నాయుడు, సీకే లావణ్య, మోహన్ రాజ్, అనురాధ గిరీ, శ్యామ్, మంజూష్, మేసక్, శశికర్ బాబు, కందస్వామి స్థానిక తెదేపా కమిటీల సభ్యులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.