పిచ్చాటూరు అక్టోబర్ 4 గరుడధాత్రి :
తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం రెప్పలపట్టు గ్రామంలో ఎస్సై బి. రాఘవేంద్ర ఆధ్వర్యంలో పోలీసు బృందం ఆపరేషన్ త్రిశూల్ కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఈ సందర్భంగా గ్రామస్తులకు మహిళల భద్రత, గంజాయి నిర్మూలన, రోడ్డు భద్రత, చోరీల నివారణ, సైబర్ మోసాల పట్ల అప్రమత్తత తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అత్యవసర సమయంలో డయల్ 112, సైబర్ మోసాల బారిన పడినప్పుడు 1930కు సమాచారం అందించాలని సూచించారు.
గ్రామంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు చోటుచేసుకున్నా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై బి. రాఘవేంద్ర గ్రామస్తులను కోరారు.