రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసమే ఒక నెల-ఒక గ్రామం
-ఎన్ ఆర్ అగ్రహారం ఒకనెల-ఒకగ్రామం కార్యక్రమంలో తహసిల్దార్ శివప్రసాద్
రెవెన్యూ సమస్యలను పరిష్కరించడం కోసమే ప్రభుత్వం విన్నుతనంగా ఒక నెల-ఒక గ్రామం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తిరుపతి జిల్లా సత్యవేడు తహసిల్దార్ శివప్రసాద్ చెప్పారు. గురువారం మండల పరిధిలోని ఎన్ఆర్ అగ్రహారం గ్రామంలో అధికారుల బృందం ఒక నెల- ఒక గ్రామం కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా అధ్యక్షత వహించిన తహసిల్దార్ మాట్లాడుతూ ప్రజలు రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరగకుండా ఒక నెల-ఒక గ్రామం కార్యక్రమంలో వారి సమస్యలను పరిష్కరించుకోవచ్చు అన్నారు.ఈ కార్యక్రమాన్ని ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజలు అందించే వినతులను పరిశీలించి అప్పటికప్పుడే పరిష్కరించడం జరుగుతుందన్నారు.ప్రధానంగా భూములకు సంబంధించిన ముటేషన్ ,రీసర్వే,హద్దులు,ప్రభుత్వ భూముల ఆక్రమణలు,22ఏ జాబితా,చుక్కల భూములు తదితర సమస్యలపై వినతులు సమర్పించుకోవచ్చునని ఆయన వివరించారు.
❄దీనిపై వెంటనే స్థల పరిశీలన చేసి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.నెలలో నాలుగు విడతలుగా ప్రతి గురువారం ఎంపిక చేసిన ఓకే గ్రామాన్ని సందర్శించి ప్రజా సమస్యలను తెలుసుకుంటామన్నారు.తదనంతరం సర్వే నెంబరు 66 లో ఓకే ఎకరా 44 సెంట్లు దేవాలయ భూములు సంబంధించి సర్వే చేసి హద్దులు చూపాలని పలు గ్రామస్తులు విన్నవించారు.
దీనిపై స్పందించిన తహసిల్దార్ శివప్రసాద్ క్షేత్రస్థాయిలో పరిశీలించి సర్వే బృందం ద్వారా అప్పటికప్పుడే హద్దులు చూపడం జరిగింది.అలాగే పొజిషన్ సర్టిఫికెట్లు మంజూరు చేయాలని పలువురు వినతులు సమర్పించారు.చెరువులో చెట్లు తొలగించి పూడికతీత పనులు చేపట్టాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల పరిషత్ పరిపాలన అధికారి త్రివిక్రమరావు,ఆర్ఐ నరేంద్ర రెడ్డి,సర్వేయర్ తంగరాజ్,వీఆర్వో విక్రాంత్, దేవాదాయ శాఖ అధికారి లత తదితరులు పాల్గొన్నారు.