రేషన్ బియ్యం అక్రమ రవాణాపై పోలీసుల ఉక్కుపాదం

బొలెరో వాహనంతో సహా 61 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం ఇద్దరిపై కేసు నమోదు కేవీబీపురం, గరుడధాత్రి న్యూస్: పేదల కడుపు నింపాల్సిన రేషన్ బియ్యం అక్రమార్కుల చేతుల్లోకి చేరకుండా తిరుపతి జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రభుత్వం చౌక ధరలకు అందిస్తున్న బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న ముఠాలపై నిఘా ముమ్మరం చేసిన పోలీసులు.. కేవీబీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. కేవీబీపురం ఎస్ఐ ఓబయ్య తన సిబ్బందితో కలిసి నిర్వహించిన తనిఖీల్లో...