రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వ ధ్యేయం : ఆర్‌జేడీ రామాంజనేయులు

పలమనేరు మార్కెట్ యార్డును ఆకస్మికంగా సందర్శించిన ఆర్‌జేడీ వివిధ జిల్లాల రైతు బజార్లకు 30 మెట్రిక్ టన్నుల టమోటాల సరఫరా పలమనేరు, జూలై 28 ( గరుడ ధాత్రి ) : రాష్ట్రంలోని టమోటా రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ వేగవంతంగా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా కడప ప్రాంతీయ సంయుక్త మార్కెటింగ్ సంచాలకులు (ఆర్‌జేడీ) సి. రామాంజనేయులు మంగళవారం పలమనేరు వ్యవసాయ మార్కెట్ కమిటీని ఆకస్మికంగా సందర్శించారు. స్థానిక మార్కెట్‌లో టమోటా ధరలు ఒక్కసారిగా పడిపోకుండా నిరోధించడం,...