GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 11 May 2026, 1:14 pm Posted by : GARUDA DHATRI NEWS

రైతులకు మార్కెట్ సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత మార్కెట్ కమిటీదే – శంకర్ రెడ్డి

రైతులకు మార్కెట్ సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత మార్కెట్ కమిటీదే
–మార్కెట్ కమిటీ ఆత్మీయ సన్మాన సమావేశంలో శంకర్ రెడ్డి

♂రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు అందేల మార్కెట్ సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత వ్యవసాయ మార్కెట్ కమిటీదేనని తిరుపతి జిల్లా సత్యవేడు నియోజవర్గ టిడిపి ప్రోగ్రాం కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి స్పష్టం చేశారు.
ఆదివారం నాగలాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ప్రాంగణంలో టిడిపి జిల్లా అధ్యక్షురాలు పనబాకలక్ష్మీ అధ్యక్షతన,నియోజకవర్గ టిడిపి ప్రోగ్రాం కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇటీవల బాధ్యతలు స్వీకరించిన నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది.
కార్యక్రమానికి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దామోదరన్ అలియాస్ జాన్సన్,వైస్ చైర్మన్ మురళి( చికెన్ చిన్న) సభ్యులు యుగంధరయ్య,లత, సునీత,జయలక్ష్మి,తుపాకుల రవణ,ఉద్ది సుబ్రమణ్యం,లక్ష్మి,మరియమ్మ,వలర్మది,కృష్ణారెడ్డి, మందపాటి సురేష్,కొల్లారామ గోవింద చౌదరి,కుమార్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా శంకర్ రెడ్డి మాట్లాడుతూ పంటలకు గిట్టుబాటు ధరలు వచ్చేవరకు వ్యవసాయ గిడ్డంగుల్లో నిల్వ ఉంచుకునేలా చూడాలన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.పంటలు సాగు చేసుకోవడానికి పెట్టుబడి కింద ప్రతి ఏడాది 20 వేల రూపాయలను ఆర్థిక సాయం అందజేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.
అయితే నాగలాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీని ఆర్థికంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.దీని పరిధిలోకి వస్తున్న తనిఖీ కేంద్రాల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడంపై కమిటీ దృష్టి సారించాలన్నారు. పైగా తనిఖీ కేంద్రాలపై నిరంతర పర్యవేక్షణ కూడా కమిటీకి ఉండాలన్నారు.అదే సమయంలో మార్కెట్ కమిటీ పరిధిలోకి వస్తున్న రైతులను అన్ని విధాల ఆదుకోవడానికి తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
అంతకు మునుపు శంకర్ రెడ్డి టిడిపి జిల్లా అధ్యక్షురాలు పనబాక లక్ష్మి,రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి స్రవంతి నాగలాపురం చేరుకోగానే వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులు స్థానిక టిడిపి నేతలతో కలిసి ఘన స్వాగతం పలికి క్రేన్ ద్వారా గజమాలతో సత్కరించారు.అనంతరం ప్రచార రథంతో పట్టణంలో ర్యాలీగా బయలుదేరి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు.
సభ ప్రారంభానికి ముందు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. తదనంతరం కూరపాటి శంకర్ రెడ్డి నూతన వ్యవసాయ మార్కెట్ చైర్మన్ జాన్సన్,వైస్ చైర్మన్ మురళిసహా సభ్యులందరినీ పేరుపేరునా పిలిచి సాలువతో సత్కరించారు.ఈ నేపథ్యంలో పనబాక లక్ష్మి,నరసింహ యాదవ్,కూరపాటి శంకర్ రెడ్డి తదితరులను స్థానిక టిడిపి నేతల గజమాల వేసి సత్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే హేమలత,సురుటుపల్లి ఆలయ చైర్మన్ పద్మనాభ రాజు,నియోజకవర్గ మండలాల టిడిపి అధ్యక్షులు శివకుమార్ నాయుడు,ప్రణీత్ రెడ్డి,గిరి, సతీష్ నాయుడు,యుగంధర్ రెడ్డి,మునుస్వామి యాదవ్,చెంచయ్య నాయుడు,పలువురు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు