GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 29 July 2026, 8:36 am Posted by : GURU SWAMY

రైతులకు సోయాబీన్స్ పై అవగాహన కార్యక్రమం

కుప్పం,జులై 28 (గరుడ ధాత్రి న్యూస్): కుప్పం నియోజకవర్గంలోని రైతులకు సోయాబీన్స్ సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కుప్పం మండలం చెక్కున త్తం పంచాయితీ లోని రైతు సేవా కేంద్రంలో మంగళవారం ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. తిరుపతి వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు రైతులకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మొదలియార్ కార్పొరేషన్ డైరెక్టర్ మణి, యువత అధ్యక్షులు కనకరాజు, పార్టీ అధ్యక్షులు బీరప్ప, నాయకులు బాలు, రామప్ప, మాదేష్, ధనప్ప, పలని, అగ్రికల్చర్ అసిస్టెంట్లు శశికళ, వినోద్ కుమార్, రైతులు పాల్గొన్నారు.