GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 02 July 2026, 4:42 pm Digital Edition : GURU SWAMY

రైతులు వర్షాధార పంటలపై మొక్కు చూపాలి

కార్వేటినగరం జూలై 2(గరుడ దాద్రి న్యూస్) :
వర్షాదారిత పంటలను ప్రోత్సహించేందుకు రైతులకు గురు వారం కార్వేటినగరం రైతు సేవా కేంద్రం వద్ద వ్యవసాయాధికారి హేమలత సోయాబీన్ విత్తనాలను పంపిణీ చేశారు. మండల పరిధిలోని కార్వేటినగరం రైతు సేవా కేంద్రం వద్ద ఎస్ వి ఎఫ్ సోయా అనే ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి హేమలత మాట్లాడుతూ డి కృషి యాప్ ద్వారా పారదర్శకంగా సోయాబీన్ విత్తనాలను రైతులకు అందజేస్తున్నట్లు తెలిపారు. వీటి ద్వారా మండలంలో సుమారు 16 హెక్టార్లలో సోయాబీన్స్ సాగులో వస్తుందాని చెప్పారు. అనంతరం రైతుల నుంచి సంస్థ ప్రతినిధులు బై బ్యాక్ ఒప్పందం ద్వారా పంట చేతికి వచ్చాక ఒక టన్నుకు 45 వేల చొప్పున తామే కొనుగోలు చేస్తామని, నాణ్యమైన విత్తనాలతో పాటు సాంకేతిక సలహాలు అందజేస్తామని సంస్థ ప్రతినిధులు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి ,వ్యవసాయ విస్తరణ అధికారులు హేమాద్రి, గాయత్రి, ఎంపీ ఈవో చైతన్య,రైతులు పాల్గొన్నారు.