రైతుల విద్యుత్ సమస్యలకు ‘నో ఎంట్రీ’ !

-నాగలాపురం డివిజన్‌లో ఓ అధికారి తీరుపై మండిపడుతున్న రైతాంగం కార్యాలయంలో అందుబాటులో లేని అధికారులు...? నాగలాపురం, సెప్టెంబర్ 04 గరుడధాత్రి : రైతులు విద్యుత్‌ సమస్యలు పరిష్కరించాల్సిన అధికారులు అందుబాటులో లేకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని నాగలాపురం డివిజన్‌ పరిధిలోని రైతులు ఆవేదన తీవ్ర వ్యక్తం చేస్తున్నారు. నాగలాపురం అదనపు డివిజనల్‌ ఇంజినీర్‌గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి సదరు అధికారి కార్యాలయంలో సక్రమంగా అందుబాటులో లేకపోవడం తో సమస్యలు పరిష్కారానికి వెసులుబాటు లేకుండా పోయింది. విద్యుత్‌ కనెక్షన్లు, సాంకేతిక సమస్యలు, ఇతర...