సత్యవేడు ఆగస్టు 13 గరుడధాత్రి :
శ్రీ సిటీ విస్తరణకు రైతుల నుంచి సంపూర్ణ సహకారం రావడంతో భూ సేకరణ పనులు వేగవంతంగా సాగుతోంది. సత్యవేడు మండలం కొల్లడం రెవిన్యూ పరిధిలో సుమారు 35 ఎకరాల భూములు మాదనపాలెం గ్రామస్తుల అనుభవంలో ఉంది. ఈ భూములకు సంబంధించి భూ సేకరణకు గాను ప్రభుత్వ నోటిఫికేషన్ కూడా ఇచ్చిన విషయం తెలిసిందే ఇదిలా ఉండగా శ్రీ సిటీ రావడంతో అనేక విధాలుగా లబ్ధి పొందిన మాదనపాలెం గ్రామస్తులు శ్రీ సిటీ విస్తరణకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు ఆ మేరకు రికార్డులు ప్రకారం భూ సర్వే చేసుకొని పరిహారం త్వరగా ఇప్పించాలని మాదనపాలెం వాసులు సూళ్లూరుపేట రెవెన్యూ డివిజనల్ అధికారి దేవేందర్ రెడ్డి ని అభ్యర్థించారు రైతుల అభ్యర్థన మేరకు.. రెవెన్యూ సిబ్బంది భూములను రైతుల సమక్షంలో క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ వివరాలు ఆరా తీస్తున్నారు
కొల్లడం రెవెన్యూ లెక్క దాఖలు సర్వేనెంబర్
221 -3 నుంచి 309 వరకు ఉన్న భూములను సర్వే చేస్తున్నారు రైతులు తమ వద్ద భూములకు సంబంధించి ఉన్న రికార్డులను అధికారులకు చూపించడం, అదే వేగంతో పొలాల సరిహద్దులు పరిశీలించుకుంటూ వస్తున్నారు
శ్రీ సిటీ రావడంతో మాదన పాలెం గ్రామ రూపురేఖలు పూర్తిగా మారిపోయిందని, ప్రధాన రోడ్డుకు ఇరువైపులా ఉన్న పూరి గుడిసెలు పూర్తిగా పెద్దపెద్ద భవంతులుగా ఏర్పడటం, అదే సందర్భంలో ప్రతి ఇంట ఉపాధి, ఆర్థిక ప్రగతి కూడా పొందారు కొత్తగా నిర్మించుకున్న ఇళ్లను అద్దెకిస్తూ.. కొందరు బాగా లాభం పొందుతున్నారు. సి ఎస్ ఆర్ నిధులతో ప్రభుత్వ పాఠశాలల్లో అనేక మౌలిక వసతులు కూడా కల్పించడం కూడా తమ కళ్ళు ఎదుటే సాగింది, ఈ నేపథ్యంలో శ్రీ సిటీ విస్తరణకు తమ వంతు సహకారంగా… తమ ఆధీనంలో ఉన్న 35 ఎకరాలను ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది రైతుల సహకారంతో గురువారం నుంచి భూ సర్వే పనులు జోరుగా సాగుతోంది