రైతుల సహకారం – సర్వే పనులు వేగవంతం
సత్యవేడు ఆగస్టు 13 గరుడధాత్రి : శ్రీ సిటీ విస్తరణకు రైతుల నుంచి సంపూర్ణ సహకారం రావడంతో భూ సేకరణ పనులు వేగవంతంగా సాగుతోంది. సత్యవేడు మండలం కొల్లడం రెవిన్యూ పరిధిలో సుమారు 35 ఎకరాల భూములు మాదనపాలెం గ్రామస్తుల అనుభవంలో ఉంది. ఈ భూములకు సంబంధించి భూ సేకరణకు గాను ప్రభుత్వ నోటిఫికేషన్ కూడా ఇచ్చిన విషయం తెలిసిందే ఇదిలా ఉండగా శ్రీ సిటీ రావడంతో అనేక విధాలుగా లబ్ధి పొందిన మాదనపాలెం గ్రామస్తులు శ్రీ సిటీ విస్తరణకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు...