నారాయణవనం జూన్ 15 (గరుడధాత్రి న్యూస్) మండల కేంద్రమైన నారాయణవనం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని రోగులకు సోమవారం సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, జడ్పిటిసి కోనేటిసుమన్ కుమార్ లు బెడ్ షీట్లు దిండులు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రి అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని అన్నారు. నారాయణవనం జడ్పిటిసి కోనేటి సుమన్ కుమార్ మాట్లాడుతూ రోగుల సౌకర్యార్థం ప్రతి ఏటా ఆసుపత్రికి అవసరమైన సదుపాయాలను సామగ్రిని అందజేస్తామని, రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతులు కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్య అధికారి దర్శిత్ రాజు, రాగ సుధా లో ఎమ్మెల్యే ఆదిమూలం, జడ్పిటిసి కోనేటి సుమన్ కుమార్ లకు కృతజ్ఞతలు తెలిపారు.