గంగాధర్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న బంధువులు.
బైరెడ్డిపల్లి గరుడదాత్రి సెప్టెంబర్16
బైరెడ్డిపల్లి మండలం లోని కవ్వంపల్లి కి చెందిన గంగాధర్ ఈ నెల 14 వ తేదీ సోమవారం సాయంత్రం కర్ణాటక సరిహద్దు గ్రామమైన మిట్టపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సమాచారంతేలిసిందే. బాధితుడు కోలార్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం విదితమే. గంగాధర్ మంగళవారం రాత్రి 11 గంటలకు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస వదలడం జరిగింది. కానీ ఈ రోడ్డు ప్రమాదంలో అతను సహజంగా చనిపోలేదని ఎవరో దుండగులు అతనిపై దాడి చేసి కర్రలతో బలంగా తల వెనుక భాగంలో కొట్టి తీవ్ర గాయాలకు గురి అయి మరణించినారని బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక పోలీసులు కేసు నమోదుచేసి వాస్తవాలు వెలుగులోకి తీసుకొనిరావలని మృతుడు బంధువులు కోరుతున్నారు. అతని మరణానికి కారకులైన దుండుగలను పట్టుకొని వారిని చట్టరీత్యా విచారించి వారిపై తగు చర్యలు తీసుకోగలరని పోలీసు శాఖ వారిని మరియు ప్రభుత్వం ను వారు కోరుచున్నారు.