GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 05 September 2026, 6:39 am Digital Edition : GURU SWAMY

రోడ్డు ప్రమాదంలో బైరెడ్డిపల్లి ఎం.ఈ.ఓ.కు గాయాలు

బైరెడ్డిపల్లి గరుడదాత్రి సెప్టెంబర్4

రాయచోటి సంబంధించిన బైరెడ్డిపల్లి మండల ఎంఈఓ1 జనార్దన రెడ్డి మదనపల్లె 150వ మైలు రాయి వద్ద రోడ్డు ప్రమాదానికి గురైయ్యాడు. మదనపల్లె – పుంగునూరు రోడ్డు, 150వ మైలురాయి వద్ద శుక్రవారం మధ్యాహ్నం బొలెరో కారు ఎదురెదురుగా వస్తున్న వాహనం ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గమనించి బాదితున్ని 108లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలను తాలూకా పోలీసులు వెల్లడించాల్సి ఉంది.. పలమనేరు ఎం.ఎల్ ఏ.అమరనాథరెడ్డి బైరెడ్డిపల్లి మండల పర్యటన లో ఎం.ఈ.ఓ. మూడురోజులు పాల్గొని శుక్రవారం రాయఛోటికి బయలుదేరారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రమాదంకు గురికావడంతో ఎం.ఎల్.ఏ. బైరెడ్డిపల్లి ఎం.ఈ.ఓ. 1 జనార్దన రెడ్డి తో సెల్ ఫోన్ ద్వారా మాటలాడి ప్రమాద వివరాలు తెలుసుకొని ఓదార్చారు. త్వరగా కోలుకోవాలని ఆశించారు.