GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 02 August 2026, 7:38 pm Digital Edition : GURU SWAMY

రోల్ కాల్స్ కు ఓ నిర్ణీత సమయం కేటాయించాలి

సదుం, గరుడ ధాత్రి ఆగస్టు 2
పోలీస్ శాఖలో ప్రతిరోజు నిర్వహించే కార్యక్రమంలో భాగంగా రోల్స్ కాల్స్ విషయంలో నిర్ణీత సమయం కేటాయించాలని అధికారులను పోలీసులు కోరుతున్నారు. రోల్స్ కాల్స్ పాల్గొనేందుకు పోలీసులకు ఉదయం ఏడు గంటల సమయాన్ని అధికారులు ఏర్పాటు కేటాయించారని అయితే ఈ సమయాన్ని ఒక గంట పెంచాలని సిబ్బంది అధికారులను కోరుతున్నారు. బయట నుంచి రోజు వచ్చే సిబ్బందికి ఉదయం కేటాయించిన సమయం సరిపోవడంలేదని వారు తెలిపారు. ఇందులో భాగంగానే సదుం పోలీస్ స్టేషన్లో హౌస్ ఆఫీసర్ విశ్వనాథం సిబ్బందికి సూచనలు, సలహాలు అందించారు. ఈరోజు చేయవలసిన కార్యక్రమం పై సిబ్బందికి ముందస్తు సమాచారాన్ని అందించారు. కార్యక్రమంలో పోలీసులు సిబ్బంది ఉన్నారు.