-హార్టికల్చర్ ప్రాంతం అభివృద్ధికి 40వేల కోట్లతో ప్రణాళికలు
-2886 కోట్లతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా ప్రతి గ్రామానికి శుద్ధజలాలు
-ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్ తో రైతులకు గిట్టుబాటు ధరలు
-ప్రకృతి సేద్యం వైపు రైతులు మొగ్గు చూపాలి
-అన్నదాతలను ఆదుకొంటున్న ప్రభుత్వాన్ని ఆదరించాలి
-బైరెడ్డిపల్లి లోఅన్నదాత సుఖీభవ నిధుల విడుదల కార్యక్రమంలో ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి
బైరెడ్డిపల్లి గరుడదాత్రి జూన్20
వైకాపా ప్రభుత్వం వల్ల ఆర్థికంగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్తూ, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అమర్ పేర్కొన్నారు. గత ఐదేళ్లలో రీ-సర్వే పేరుతో ప్రజలలో ఒకరకమైనభయాందోళనలు సృష్టించారని, కానీ ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించే అవకాశం లభించిందని అన్నారు.
చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రానికి, నియోజకవర్గానికి మంచి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీలలో భాగమైన ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద రెండవ సంవత్సరానికి సంబంధించి శనివారం మొదటి విడతగా ₹7,000 (రాష్ట్రం నుండి ₹5,000, కేంద్రం నుండి ₹2,000) నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని పేర్కొన్నారు. నియోజకవర్గంలో గత రెండేళ్లలో ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద ₹132 కోట్లు, ఈజీఎస్ కింద ₹70 కోట్లతో గ్రామాల్లో అంతర్గత రోడ్లు, డీఎంఎఫ్ కింద ₹9 కోట్లతో రోడ్ల నిర్మాణ పనులు పూర్తి చేసినట్లు వివరించారు.
ఈ ప్రాంత రైతాంగం ఎక్కువగా హార్టికల్చర్ పై ఆధారపడి ఉన్నందున, సుమారు ₹40,000 కోట్ల రూపాయలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి తీసుకువచ్చి రోడ్లు, మార్కెటింగ్, నీటి సదుపాయాలు కల్పించడానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.
మొత్తం పెట్టుబడులతో కలిపి లక్ష కోట్లను రాయలసీమలో ఖర్చు పెట్టాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉందని, దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ కూడా ముగింపు దశకు వచ్చిందని తెలిపారు.
పలమనేరు సమీపంలోని క్యాటిల్ ఫార్మ్ వద్ద ఒక పెద్ద ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్ నిర్మాణానికి 33 ఎకరాల భూమిని కేటాయించామని, త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయని చెప్పారు.2018 లో తానే స్వయంగా మంత్రిగా, శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి హంద్రీ-నీవా నీటిని తీసుకువచ్చామని గుర్తుచేశారు.
చంద్రబాబు నాయుడు కుప్పం వరకు నీళ్లు తీసుకువెళ్లడం వల్ల తమ నియోజకవర్గంలోని 60-70% చెరువులు మొదటి దఫాలోనే నిండుకున్నాయని, బైరెడ్డిపల్లి చెరువు కూడా 60% వరకు నిండిందని తెలిపారు.
గ్రావిటీ ద్వారా నీరు వెళ్లే చెరువులన్నింటికీ మొదటి ఫేజ్ లో నీటిని అందిస్తామని, గ్రావిటీ ద్వారా నీరు వెళ్ళలేని చెరువులకు తాత్కాలిక లిఫ్టుల (Temporary Lifts) ద్వారా నీటిని అందించాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అని పేర్కొన్నారు.
మదనపల్లి, పుంగనూరు, పలమనేరు, కుప్పం, తంబళ్లపల్లి నియోజకవర్గాలకు ₹2,886 కోట్ల రూపాయలతో గండికోట మరియు గాలివీడు వద్ద ప్లాంట్ ఏర్పాటు చేసి, శుద్ధి చేసిన తాగునీటిని పైప్‌లైన్ల ద్వారా ప్రతి చిన్న గ్రామానికి 24 గంటలు అందించే కార్యక్రమానికి త్వరలోనే టెండర్లు పిలవబోతున్నామని శుభవార్థ ప్రజలకు చెప్పారు.
కైగల్ మరియు కౌండిన్య నదులకు సంబంధించిన చెక్ డ్యామ్‌ల నిర్మాణానికి రీ-ఎస్టిమేట్ వేయాల్సిందిగా పంపించారని తెలిపారు.
గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయకపోవడం వల్లే ప్రస్తుతం వర్షాలు లేకపోయినా నీటిని తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడిందని, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండి ఉంటే పోలవరం పూర్తయి శ్రీశైలం ద్వారా రాయలసీమకు నీళ్లు వచ్చేవని, తద్వారా బోర్లు రీఛార్జ్ అయ్యేవని అభిప్రాయపడ్డారు.
సాంప్రదాయకంగా వేసే వేరుశనగ (చెనక్కాయ) పంటకు బదులుగా తక్కువ నీటితో, ఒక వర్షానికే పండే సోయాబీన్, దాల్ (పప్పుధాన్యాలు) వంటి పంటలను సాగు చేయాలని, వీటికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి ధరలు ఉన్నాయని సూచించారు.
అధిక రసాయన ఎరువులు, మందులు వాడి భూమిని పాడుచేసుకోవద్దని కోరారు.
గత ఐదేళ్లలో డ్రిప్ పరికరాలు అందించలేదని, కానీ ప్రస్తుత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు 100% సబ్సిడీ, మిగిలిన చిన్న, సన్నకారు రైతులకు 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను అందిస్తోందని తెలిపారు.
మామిడి రైతులకు గత ఏడాది ప్రభుత్వం ₹4 సబ్సిడీని ప్రకటించిందని, సుమారు ₹300 కోట్లు రైతుల ఖాతాల్లో వేశామని గుర్తు చేస్తూ, ఈ ఏడాది కూడా చంద్రబాబు నాయుడు రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ కింద కేజీకి రూ.4 అందించేలా చర్యలు తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.
మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని, అలాగే ‘దీపం’ పథకం కింద మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు.
స్కూలుకు వెళ్లే పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి బిడ్డకూ ‘తల్లి వందనం’ పథకం కింద ₹14,000 నేరుగా తల్లి ఖాతాలో వేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం త్వరలోనే ప్రారంభించబోతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పలమనేరు మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న, బాలాజీ కో-ఆపరేటివ్ సూపర్ బజార్ అధ్యక్షులు ఆర్వీ బాలాజీ, కూటమి నాయకులు కిషోర్ గౌడు, సుబ్రహ్మణ్యం శెట్టి,రఘుచంద్ర గుప్త,భువనచంద్ర గౌడు , సుబ్రహ్మణ్యం గౌడు, రాంబాబు,గజేంద్ర, ఖాజా, దిలీప్ కుమార్, విజయ్ కుమార్, నాగరాజు రెడ్డి, లతోపాటు సింగిల్ విండో చైర్మన్లు డైరెక్టర్లు మరియు పలు శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.